NTV Telugu Site icon

Tim Seifert Batting: బంతిని బాదేందుకు భారీ డైవ్‌ చేసిన బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వులే!

Tim Seifert Diving

Tim Seifert Diving

Tim Seifert Diving Video Goes VIral: సాధారణంగా క్రికెట్ ఆటలో ఫీల్డర్లు విన్యాసాలు చేస్తుంటారు. ఫీల్డింగ్‌ చేసేప్పుడు.. బంతిని ఆపేందుకు లేదా క్యాచ్ పట్టేందుకు ఫీల్డర్లు డైవ్‌లు చేస్తారు. అయితే ఓ బ్యాటర్ బంతిని బాదేందుకు భారీ డైవ్‌ చేశాడు. అయినా కూడా షాట్ ఆడడంలో అతడు విఫలమయ్యాడు. ఈ ఘటన శనివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Dhruv Jurel: నేను భారత జట్టులో ఆడుతోంది ఆయన కోసమే: ధ్రువ్ జురెల్

పాకిస్తాన్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య లాహోర్‌లో శనివారం ఐదవ టీ20 మ్యాచ్ జరిగింది. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా 6వ ఓవర్‌ను మొహమ్మద్ అమిర్ వేశాడు. రెండో బంతిని అమిర్ భారీ వైడ్ వేయగా.. బ్యాటర్ టీమ్ సీఫెర్ట్ షాట్ ఆడాడు. అయితే షాట్ ఆడేందుకు సీఫెర్ట్ ఏకంగా గాల్లో డైవ్ చేశాడు. అయినా కూడా బంతి బ్యాట్‌కు కనెక్ట్ కాలేదు. సీఫర్ట్‌ డైవిండ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

Show comments