అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ట్రంప్ కు న్యూయార్క్ కోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా ట్రంప్, ఆయన కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ తేల్చింది. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్న న్యూయార్క్ కోర్ట్ న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్ కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, అక్రమంగా రుణాలు పొందారని పేర్కొ్న్నారు.
Also Read: IND vs AUS 3rd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆరు మార్పులతో బరిలోకి భారత్! ఇషాన్, అశ్విన్ ఔట్
కొన్ని వార్తా సంస్థల కథనాల ప్రకారం ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు, ఆయన సంతానానికి 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కోరారు. ట్రంప్, అతని ముగ్గురు పిల్లలు సంయుక్తంగా వారి కంపెనీల విలువను పెంచి, బ్యాంకులు, బీమా సంస్థలకు చూపారని లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ఇక ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయాలేదని, ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని ట్రంప్ చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. విచారణకు ముందే ట్రంప్ పై ఉన్న కేసులను కొట్టివేయాలని అతని లాయర్లు న్యూయర్క్ జడ్జ్ ను గతంలో కోరారు.
అయితే కేసును విచారించిన న్యూయర్క్ జడ్జి ఆర్థర్ ఎంగ్రోన్ ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు నిజమే అని నిర్థారించారు. అయితే అక్టోబర్ 2న నాన్-జ్యూరీ ట్రయల్‌ని నిర్వహించి ట్రంప్‌కు విధించాల్సిన శిక్షపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ కు కనుక శిక్ష ఖరారు చేస్తే 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి కాను గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక అదే కనుక జరిగితే భారత సంతతి వివేక్ రామస్వామికి రూట్ క్లియర్ కానుంది.