Site icon NTV Telugu

Cat In Passengers Suitcase: కంగుతిన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ప్రయాణికుడి సూట్ కేసులో..

Airport

Airport

Cat In Passengers Suitcase: విమానాశ్రయాల్లో తనిఖీలు సర్వసాధారణం… ప్రయాణికుల లగేజీలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే వారిని లోపలికి అనుమతిస్తారు. విమాన ప్రయాణికుల లగేజీని స్కానింగ్ చేస్తారు. వాళ్ల బ్యాగులు, సూట్ కేసుల్లో ఏముందో తెలుసుకున్న తర్వాతే క్యాబిన్ లోకి పంపిస్తారు. ఇలా న్యూయార్క్ జేఎఫ్ కే అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడిని చెక్ చేసిన అక్కడి సిబ్బంది అవాక్కయ్యారు. సదరు ప్రయాణికుడి సూట్ కేసులో ఓ పిల్లిని ఉన్నట్టు స్కాన్ లో తేలడంతో అంతా షాకయ్యారు. న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వెళ్తున్న ప్యాసింజర్ కు చెందిన లగేజీ పిల్లిని గుర్తించారు. మొదట షాకైన సెక్యూరిటీ సిబ్బంది తర్వాత దాన్ని బయటకు తీసి తిరిగి సదరు ప్రయాణికుడికే అప్పగించారు. ఈ విషయాన్ని జేఎఫ్ కే ఎయిర్ పోర్టు సిబ్బంది ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కాగా, తన పెంపుడు పిల్లి సూట్ కేస్ లోకి ఎలా వచ్చిందో తెలియదని సదరు ప్రయాణికుడు పేర్కొన్నాడు.

Exit mobile version