Site icon NTV Telugu

Krithi Shetty : కొత్త సంవత్సరం..సరికొత్త లుక్ లో మెరిసిన కృతి శెట్టి..

Whatsapp Image 2024 01 01 At 4.35.12 Pm

Whatsapp Image 2024 01 01 At 4.35.12 Pm

కృతి శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రం తోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది..ఉప్పెన సినిమా హిట్ తో కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ మరియు మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది.వీటిలో బంగార్రాజు సినిమా మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది . మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.

గత ఏడాది కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రం లో నటించింది. నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వం లో వచ్చిన కస్టడీ చిత్రం మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది.దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమా లో పడింది అనే చెప్పాలి.గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే.. 2023 కృతి శెట్టి కి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరం లో అయినా తనకి కలసి రావాలని ఫాన్స్ కి న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కృతి శెట్టి బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజుల తో దిగిన పిక్స్ పోస్ట్ చేసింది. కొత్త సంవత్సరం లో కృతి శెట్టి తన లుక్ కూడా పూర్తి గా మార్చేసినట్లు ఉంది.నడుము సొగసు, క్లీవేజ్ ఇలా అన్ని అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి పరువాలు వెదజల్లుతూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి

Exit mobile version