Site icon NTV Telugu

Pet Dog: కుక్కను పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాల్సిందే

Dog

Dog

Pet Dog: ఉత్తర ప్రదేశ్‎లోని ఘజియాబాద్‎లో పెంపుడు కుక్కల పెంపకాన్ని అధికార యంత్రాంగం నిషేధించింది. పట్టణవాసులకు పెంపుడు కుక్కలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. స్థానికులపై వరుసదాడులకు పాల్పడడంతో వాటి విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఘజియాబాద్ మున్సిపల్ యంత్రాంగం పిట్ బుల్, రాట్ వీలర్, డోగో అర్జెంటినో అనే మూడు రకాల శునక జాతులను పెంచుకోవడాన్ని నిషేధించింది.

Read Also: Edible-Oil-Prices: పెరిగిన దిగుమతులు.. తగ్గుతున్న వంట నూనెల ధరలు

ఇక మీదట శునకాలను పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి. నవంబర్ 1 నుంచి లైసెన్స్ ల జారీ ప్రక్రియ మొదలు కానుంది. రెండు నెలల వ్యవధిలో లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఎత్తయిన అపార్ట్ మెంట్లలో ఉండేవారు తమ శునకాలను సర్వీస్ లిఫ్ట్ ల్లోనే తీసుకెళ్లాలి. కామన్ లిఫ్ట్ లో తీసుకెళ్లకూడదు. బయటకు తీసుకువెళుతుంటే వాటి మూతికి కవచం పెట్టాలి. ఈ మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Sitrang Cyclone: ‘సిత్రాంగ్’ వచ్చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త

‘‘పిట్ బుల్, రాట్ వీలర్, డోగో అర్జెంటినో జాతులు క్రూర స్వభావం కలిగినవి. ఈ శునకాలను కలిగి ఉండేందుకు అనుమతులు ఇవ్వం. లైసెన్స్ జారీ చేసేది లేదు. ఎవరైనా ఈ జాతి కుక్కలను కొనుగోలు చేస్తే అందుకు పూర్తి బాధ్యత వారే వహించాలి’’అని ఘజియాబాద్ బీజేపీ నేత, కౌన్సిలర్ సంజయ్ సింగ్ తెలిపారు. ఈ జాతి శునకాలను నిషేధించాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది సంజయ్ సింగ్ కావడం గమనార్హం. దీనికి మున్సిపల్ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇటీవలి కాలంలో పట్టణంలో 10 మంది పిల్లలు పెంపుడు కుక్కల దాడిలో గాయపడ్డాడు. ఒక చిన్నారి ముఖంపై 150 కుట్లు పడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version