NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

New Project 2024 11 05t131333.105

New Project 2024 11 05t131333.105

Pushpa 2 : ప్రపంచవ్యాప్తంగా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 నంబర్ 1 స్థానంలో ఉంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు. . నిజానికి సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని టీమ్ తప్ప ఎవరూ ఊహించి ఉండరు. అయితే విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. దానికి తోడు ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఊహించని విధంగా మంచి వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విపరీతంగా క్రేజ్ తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమాకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు.

Read Also:Green Tea Effects: ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే?

‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమా రిలీజ్ ను తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Read Also:Jacqueline Fernandez : పేదల కోసం స్టార్ హీరోయిన్ వేసుకున్న దుస్తులు వేలం.. త్వరగా పాడేసేయండి

తాజాగా పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మరో నెల రోజుల్లో పుష్ప- 2′ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఫహాద్ పాటిల్ ఎదురుపడిన పోస్టరును మూవీ టీమ్ రిలీజ్ చేసింది. “డిస్ట్ ఆఫ్ ది ఇయర్ రాబోతోంది. సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది యూనిట్. త్వరలోనే ట్రైలర్ను విడుదల చేస్తామని తెలిపింది.

Show comments