NTV Telugu Site icon

New Pics Of Moon By Chandrayaan 3: జాబిల్లి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3… షేర్ చేసిన ఇస్రో

Chandrayaan

Chandrayaan

New Pics Of Moon By Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ జాబిల్లి పైకి చేరుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. చంద్రయాన్ 3 ని జాబిల్లి గురించి లోతుగా పరిశోధించడానికి ఇస్రో రూపొందించింది. ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేదు. చంద్రయాన్ 3 కనుక చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండిగ్ అయితే ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలవనుంది. మరోవైపు దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా నిలుస్తుంది. ఇప్పటికే ఒక్కో ఘట్టాన్ని పూర్త చేసుకుంటూ వెళుతున్న చంద్రయాన్ 3 తాజాగా చంద్రుని చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్ ఆర్బిటర్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వాటి మధ్య డేటా ట్రాన్స్ ఫర్ కూడా జరిగినట్లు ఇస్రో ప్రకటించింది.

Also Read: Luna 25: లూనా 25 క్రాష్.. భారత్ కన్నా ముందు సాధించాలన్నా ఆత్రమే కొంపముంచిందా?

ఇక తాజాగా చంద్రయాన్ 3 తీసిన జాబిల్లి ఫోటోలను ఇస్రో ఎక్స్( ట్విటర్) వేదికగా పంచుకుంది. ఆగస్ట్ 20న ట్విటర్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకున్న ఇస్రో నేడు తాజాగా తీసిన మరిన్ని ఫోటోలను షేర్ చేసింది. ల్యాండర్ పొజిషన్ డిటెక్టర్ తీసిన ఫోటోలను ఇస్రో షేర్ చేసింది. ఆగస్టు 20న షేర్ చేసిన ఫోటోలను ఇమేజర్ కెమెరా 4 తో తీసింది చంద్రయాన్ 3. దీని బట్టి చూస్తుంటే చంద్రునిపై ల్యాండ్ అవడానికి అనుకూలమైన ప్రదేశాల కోసం విక్రమ్ ల్యాండర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రునిపై ఉన్న బండరాళ్లు, గుంతల ఫోటోలను తీసింది విక్రమ్ ల్యాండర్. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 23 సాయంత్రం 6.04గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లి పైకి చేరుకోవాలి. అయితే ఇది జాబిల్లి పైకి వెళ్లడానికి రెండు గంటల ముందు పరిస్థితులన్నీ చూసుకొని అప్పుడు అనుకూలంగా ఉంటేనే విక్రమ్ ను ల్యాండ్ చేస్తామని లేదండే ల్యాండింగ్ తేదీ మారవచ్చని ఇస్రో ప్రకటించింది. అయితే భారత్ కంటే ముందే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలని ప్రయత్నించి రష్యా విఫలమైన సంగతి తెలిసిందే. రష్యా పంపిన లూనా 25 ల్యాండింగ్ సమయంలో జాబిల్లికి తగిలి క్రాష్ అయినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ ప్రకటించింది.  ఇక చంద్రయాన్ 3 కనుక జాబిల్లి పై సేఫ్ గా ల్యాండ్ అయితే అంతరిక్ష పరిశోధనలో భారత్ ఎలైట్ లిస్ట్ లోకి చేరుతుంది.