Gold Rate Today: నేడు తులంపై రూ.1310 పెరిగింది.. ఆల్‌టైమ్ రికార్డుకు బంగారం ధరలు!

  • గోల్డ్ లవర్స్‌కి భారీ షాక్
  • ఆల్‌టైమ్ రికార్డుకు బంగారం ధరలు
  • తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Gold Price All Time High

Gold Price All Time High

బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పసిడి ధరలు వరుసగా మూడో రోజు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరిగి.. రూ.77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగి.. రూ.84,330గా ఉంది. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు బంగారం ధరలు పెరగడం విశేషం. ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకోవడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు.

మరోవైపు వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. ఇటీవలి కాలంలో స్థిరంగా ఉన్న వెండి.. వరుసగా రెండోరోజు పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.99,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.99,500గా కొనసాగుతోంది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,300
విజయవాడ – రూ.77,300
ఢిల్లీ – రూ.77,450
చెన్నై – రూ.77,300
బెంగళూరు – రూ.77,300
ముంబై – రూ.77,300
కోల్‌కతా – రూ.77,300
కేరళ – రూ.77,300

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.84,330
విజయవాడ – రూ.84,330
ఢిల్లీ – రూ.84,480
చెన్నై – రూ.84,330
బెంగళూరు – రూ.84,330
ముంబై – రూ.84,330
కోల్‌కతా – రూ.84,330
కేరళ – రూ.84,330

Also Read: Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్‌ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.99,500
ముంబై – రూ.99,500
చెన్నై – రూ.1,07,000
కోల్‎కతా – రూ.99,500
బెంగళూరు – రూ.99,500
కేరళ – రూ.1,07,000