Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News New Income Tax Regime From Today For Ay 2024 25 Here New Tax Regime Calculator Details

New Tax Regime Calculator: కొత్త ఆదాయపు పన్ను విధానం.. తప్పుడు సమాచారంపై కేంద్రం క్లారిటీ!

Published Date :April 1, 2024 , 10:35 am
By Sampath Kumar
New Tax Regime Calculator: కొత్త ఆదాయపు పన్ను విధానం.. తప్పుడు సమాచారంపై కేంద్రం క్లారిటీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Income Tax Regime New Calculator in India: 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి మొదలైంది. అంటే.. నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను ప్రారంభమైంది. ఈ ఆర్థిక ఏడాదిలో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త పన్ను విధానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఎక్స్‌ ద్వారా స్పందించింది. కొత్త పన్ను విధానంకు సంబంధించి పలు కీలకాంశాలను షేర్ చేసింది.

కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త పన్ను విధానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరు అంశాలను వివరించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

# 01.04.2024 నుంచి పన్ను విధానంలో కొత్త మార్పు ఏదీ లేదు.
# సెక్షన్‌ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టబడింది.
# 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా ఇతర వ్యక్తులకు కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది.
# కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలోని మినహాయింపులు, డిడక్షన్స్‌ (స్టాండర్డ్‌ డిడక్షన్‌ 50,000, ఫ్యామిలీ పెన్షన్‌ 15,000 మినహా)లు కొత్త విధానంలో లేవు.
# కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను చెల్లింపుదారులు తమకు లాభదాయకంగా భావించే పన్ను విధానాన్ని (పాత లేదా కొత్త) ఎంచుకోవచ్చు.
# 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్న్ ఫైల్‌ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని, మరొక సంవత్సరంలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

కొత్త పన్ను విధానం 115 BAC (1A):
రూ. 3 లక్షల వరకు 0% పన్ను
రూ. 3-6 లక్షల వరకు 5% పన్ను
రూ. 6-9 లక్షల వరకు 10% పన్ను
రూ. 9-12 లక్షల వరకు 15% పన్ను
రూ. 12-15 లక్షల వరకు 20% పన్ను
రూ. 15 లక్షలకు పైన 30% పన్ను

పాత పన్ను విధానం:
రూ. 2.5 లక్షల వరకు 0% పన్ను
రూ. 2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను
రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను
రూ. 10 లక్షలకుపైన 30% పన్ను

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • income tax
  • new income tax regime
  • New Income Tax Regime Calculator
  • New Income Tax Regime Deductions
  • New Income Tax Regime Slabs

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions