Site icon NTV Telugu

Rajahmundry-Tirupati Flight Service: రాజమండ్రి – తిరుపతి మధ్య విమాన సర్వీసులు స్టార్ట్.. రూ.1,999కే..

Rajahmundry Tirupati Flight

Rajahmundry Tirupati Flight

Rajahmundry-Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతి.. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది విమానయాన శాఖ.. ఇవాళ రాజమండ్రి – తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి.. రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు అంటే, మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు నడిపించనున్నారు.. ఇవాళ ఉదయం 7:40కు తిరుపతి నుంచి బయలుదేరి 9:25కు రాజమండ్రి చేరుకుంది తొలి విమానం.. ఇక, ఉదయం 9:50కు రాజమండ్రి నుంచి బయలుదేరి 11:20కి తిరుపతి చేరుకొంది.. ఈ విమాన సర్వీసుతో రాజమండ్రి–తిరుపతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయినట్టు అయ్యింది.. ముందుగా బుక్ చేసుకుంటే మొదటి 30 టికెట్లు 1999 రూపాయలు మాత్రమే కాగా.. మిగిలిన 40 టిక్కెట్లు 4000 రూపాయలకే అందుబాటులో ఉంచనున్నట్టు అలయన్స్ ఎయిర్ ప్రతినిధులు చెబుతున్నారు..

Read Also: LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే?

ఇక, త్వరలోనే రాజమండ్రి నుండి గోవా, కొచ్చి, వారణాసిలకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.. బెంగళూరుకు మరొక అదనపు విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు , ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె.యన్.శ్రీకాంత్, అలయన్స్ ఎయిర్ ప్రతినిధులు పాల్గొన్నారు..

Exit mobile version