Site icon NTV Telugu

Toll Charge: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎంత తిరిగితే అంతే చార్జి

Fastag

Fastag

Toll Charge: వాహనదారులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం నడుస్తున్న ఫాస్టాగ్ విధానం మారిపోయి కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం ద్వారా ఒక టోల్ ప్లాజా వద్ద వాహనం క్రాస్ చేస్తున్న సమయంలో ఆర్ఎఫ్ఐడీ స్కాన్ ద్వారా సదరు వాహన నంబర్ కు అనుసంధానమైన ఉన్న బ్యాంకు ఖాతా నుంచి బ్యాలన్స్ కట్ అవుతోంది. కానీ, కొత్త విధానంలో ఒక టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతే అంత చార్జి చెల్లించాల్సిన అవసరం లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోతే, అంత వరకే టోల్ చార్జీ వసూలు చేస్తారు.

Read Also: Shiv Sena leader shot dead : పంజాబ్‌లో పోలీసుల ఎదుటే శివసేన నేతపై కాల్పులు

జీపీఎస్ ఆధారంగా వాహనం ఎంత దూరం వెళ్లి ఆగిపోయిందన్నది సిస్టమ్ ఆటోమేటిగ్గా గుర్తిస్తుంది. దాని ఆధారంగా చార్జీని సదరు వాహనదారుడి ఖాతా నుంచి డెబిట్ చేసుకుంటుంది. ఒక టోల్ రోడ్డుపైకి వాహనం ఎన్నో కిలోమీటర్ వద్ద ప్రవేశించి, ఎన్నో కిలోమీటర్ వద్ద ప్రయాణం ముగించిందన్నది కొత్త విధానం ద్వారా గుర్తించి చార్జీ వసూలు చేస్తారు. దీనివల్ల వాహనదారులకు నగదు చాలా ఆదా అవుతుంది. జర్మనీ, రష్యా వంటి దేశాల్లో ఈ విధానంలోనే టోల్ చార్జీ వసూళ్లు అమల్లో ఉన్నాయి. ఇదే విధానం భారత్ లోనూ అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం. ప్రస్తుతం ఈ విధానం ప్రయోగాత్మక దశలో ఉంది. ఇందుకు ప్రతీ వాహనంలో శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ పరికరాలను అమర్చాల్సి ఉంటుంది. ఇందుకు మోటారు వాహన చట్టంలోనూ సవరణలు తప్పనిసరి అవుతాయి.

Exit mobile version