NTV Telugu Site icon

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన నూతన సీఎస్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి

Ks Jawahar Reddy

Ks Jawahar Reddy

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి నేడు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం సీఎం జగన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.  సమీర్‌ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి జవహర్‌రెడ్డి.. సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు.

Also Read : Digital Rupee: నేడు డిజిటల్ రూపాయి ప్రారంభం.. తొలి విడతలో నాలుగు నగరాల్లో లాంచ్

ఇదిలా ఉంటే.. అనంతరం.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య కలిశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిన్న బాధ్యతలు స్వీకరించారు డాక్టర్‌ పూనం మాలకొండయ్య. అంతేకాకుండా.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ కలిశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టూ చీఫ్‌ మినిస్టర్‌గా సమీర్‌ శర్మకు నూతన బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : Bandi Sanjay: సిరిసిల్లలో మరోసారి ఫ్లెక్సీల కలకలం.. బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలు..