Site icon NTV Telugu

Yuvraj Singh: మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి.. యువరాజ్ సింగ్ యాడ్‌పై విమర్శలు!

Check Your Oranges

Check Your Oranges

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్ సింగ్‌‌‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘యూవీకెన్’ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ ఎన్జీవో దేశంలోని మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌‌ బారిన పడకుండా ఉండేందుకు యాడ్‌లు చేస్తుంటుంది. తాజాగా యూవీకెన్ చేసిన యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘యువరాజా.. ఇదేం అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌’ అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌‌ బారిన పడకుండా ఉండేందుకు మహిళలు తరచూ తమని తాము పరిశీలించుకోవాలంటూ యూవీకెన్ తాజాగా ఓ యాడ్‌ విడుదల చేసింది. ఏఐ ద్వారా రూపొందించిన పోస్టర్‌ను ఓ మెట్రో కోచ్‌లో అతికించింది. ఆ పోస్టర్‌లో ఒక యువతి రెండు నారింజ పండ్లను పట్టుకుని బస్సులో నిలబడి ఉండగా.. పలువురు మహిళలు ఆమెను చుస్తున్నారు. ‘మహిళలు నెలకోసారి తమ నారింజలను చెక్ చేసుకోలి’ అని కాస్త అసభ్యకరంగా రాసుకొచ్చింది. యూవీకెన్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. నారింజలు అనే పదం వాడడం కొందరికి నచ్చలేదు. దాంతో ఈ యాడ్‌పై విమర్శలు వస్తున్నాయి. యువరాజ్ సింగ్‌పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Maria Sharapova: రష్యా అందం మరియా షరపోవాకు అరుదైన గౌరవం!

ఒక మహిళ తన ఎక్స్‌ ఖాతాలో యూవీకెన్ యాడ్‌ను పోస్ట్ చేసి.. ‘సున్నితమైన విషయాలలో ఎలా స్పందించాలో, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కలిగించాలో కొందరికి కనీస స్పృహ లేకుండా పోతోంది. మీ ఆరెంజ్‌లను చెక్‌ చేసుకోండి అనే పోస్టర్‌ను ఢిల్లీ మెట్రోలో చూశాను. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించా. ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు, వీటిని ఎవరు ఆమోదిస్తారు?. ఇలాంటి మూర్ఖులు మన మధ్య ఉన్నారా?’ అంటూ మండిపడ్డారు. మరో పోస్టులో ఐ నెటిజన్ యువరాజ్‌ను ట్యాగ్ చేశారు. ‘హాయ్ యువరాజ్. ఇది నీ ఎన్జీఓ ఇచ్చిన ప్రకటన అని తెలిసింది. నీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఈ ప్రకటనను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ఇక అప్రమత్తమైన మెట్రో అధికారులు ఆ పోస్టర్‌ను తొలగించారు.

Exit mobile version