ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిన్న (శనివారం) వాఖండే వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో గ్రీన్ ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టిన గ్రీన్.. అనంతరం బ్యాటింగ్ లో ( 43 బంతుల్లో 67 ) అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడాడు. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ కామెరూన్ గ్రీన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ లో బ్యాటగింగ్ లో 64 పరుగులు చేసిన గ్రీన్.. బౌలింగ్ లో ఒక్క వికెట్ తీసుకున్నాడు.
Also Read : Srikakulam : సాయంగా ఉంటాడనుకుంటే.. సక్కగా పెళ్లాంనే లైన్లో పెట్టాడు.. తట్టకోలేక చంపి పాతేశాడు
ఐపీఎల్- 2023 సీజన్ కు ముందు జరిగిన మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ ను పోటీ పడి మరి రూ. 17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే తొలి నాలుగు మ్యాచ్ ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగా అని జట్టులో నుంచి తీసి వేయండి అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇక గ్రీన్ తన అద్భుతమైన ప్రదర్శనతో విమర్శలకు చెక్ పెట్టాడు. అతడిని విమర్శించిన వారి నుంచే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. గ్రీన్ అద్భుతమైన ఆల్ రౌండర్ అని.. అతడు తను తీసుకున్న మొత్తానికి తగిన న్యాయం చేస్తున్నాడని ముంబై అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్ లో 6 మ్యాచ్ లు ఆడిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ 199 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు.
Also Read : Simhadri Appanna : సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళన