Site icon NTV Telugu

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌.. ఏకంగా రూ. ఆరున్నర లక్షల కోట్ల భారీ డీల్..!

Netflix Acquires Warner Bros

Netflix Acquires Warner Bros

Netflix to Acquire Warner Bros Discovery in Billion-Dollar Deal: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో కీలక ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, ఫిల్మ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏకంగా బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. ఇప్పటికే.. నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్‌ సర్వీస్‌ గా కొనసాగుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీని భారీ డీల్‌తో హస్తగతం చేసుకుంది! ఒక్కో వార్నర్‌ బ్రదర్స్‌ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) బిడ్‌ వేసినట్లు రాయిటార్స్ నివేదించింది.

READ MORE: Indigo: తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ప్రయాణికులు

సీఎన్‌ఎన్‌, టీబీఎస్‌, టీఎన్‌టీ వంటి కేబుల్‌ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్‌ బ్రదర్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని నివేదిక వెల్లడించింది. మరోవైపు.. బోకె క్యాపిటల్ పార్టనర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కిమ్ ఫారెస్ట్ ఈ అంశంపై మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ విజేత బిడ్డర్‌గా అవతరించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. నెట్‌ఫ్లిక్స్ బలమైన డొమైన్ అయిన స్ట్రీమింగ్ వ్యాపారంపై దృష్టి సారిస్తున్నందున ఇది సాధ్యమైందని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థల నుంచి తీవ్ర పరిశీలనను ఎదుర్కోవలసి ఉంటుందని ఆమె హెచ్చరించారు.

READ MORE:బంపర్ ఆఫర్.. రూ. 60 వేలు విలువైన Samsung Galaxy S24 FE ఫోన్ కేవలం రూ. 31 వేలకే..

Exit mobile version