Nepal PM Election: నేపాల్‌లో చెలరేగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. తాజాగా ఒక కొత్త విషయం బయటికి వచ్చింది. నేపాల్ నిరసనకారులు తమ దేశానికి తాత్కాలిక ప్రధాని ఎన్నుకోవడానికి ఒక గేమింగ్ యాప్‌ను ఉపయోగించారు. అలాగే వాళ్లు సోషల్ మీడియాలో సర్వేలు కూడా నిర్వహించినట్లు సమాచారం. గేమింగ్ యాప్‌లో నిర్వహించిన ఎన్నికల్లో సుశీలా కర్కికి 50 శాతం ఓట్ల వచ్చాయి. కేవలం ఈ ఓట్ల ఆధారంగానే ఆమెను ఎంపిక చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమింటే ఈ ఓట్లు ఎవరు వేశారు అనేది ఎవరికీ తెలియదు.
READ ALSO: They Call Him OG: గన్స్ అండ్ రోజెస్ సాంగేసుకున్న పవన్
నంబర్ వన్‌గా నిలిచిన సుశీల కర్కీ
పలు నివేదికల ప్రకారం.. నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా తర్వాత, జనరేషన్-జెడ్ నాయకులు డిస్కార్డ్‌లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుశీలా కార్కితో పాటు, ధరణ్ మేయర్ హర్ద్కా సంపాగ్, మహావీర్ పున్ పేర్లు ఉన్నాయి. డిస్కార్డ్‌పై నిర్వహించిన ఈ పోల్‌లో మొత్తం 7713 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 శాతం ఓట్లు ప్రస్తుత నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీకి అనుకూలంగా వచ్చాయి. రాండమ్ నేపాలీ అనేది రెండవ స్థానంలో ఉంది. రాండమ్ నేపాలీ అంటే నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి అని అర్థం. సాగర్ ధకల్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆయన అనుకూలంగా 1000 మందికి పైగా ఓటు వేశారు. ధరణ్ మేయర్ హర్ద్కా సంపాంగ్ నాల్గవ స్థానంలో, మహావీర్ పున్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ సర్వే ఆధారంగా జనరల్-జెడ్ ప్రతినిధులు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌తో సుశీలా కార్కిని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమింపజేశారని సమాచారం.
సర్వేలో తలెత్తిన 2 ప్రశ్నలు..
ఈ సర్వేలో రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిస్కార్డ్ ఒక అమెరికన్ గేమింగ్ కంపెనీ. దీనికి 200 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. డిస్కార్డ్‌లో ఈ ప్రశ్నను ఎవరు పోస్ట్ చేసారు. అలా పోస్ట్ చేసిన ఆయన ఈ ప్రశ్నను ఏ హోదాలో పోస్ట్ చేసారు?. రెండవది ఈ సర్వేలో ఎవరెవరు పాల్గొన్నారు?. యాప్‌లో గోప్యతా దృష్ట్యా, దాని వినియోగదారుల గురించి చెప్పదు. నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎన్నికల్లో నేపాలీలు మాత్రమే పాల్గొన్నారా, లేకపోతే ఇతర దేశాలకు చెందిన వాళ్లు కూడా పాల్గొన్నారా అనేది ఎవరికీ తెలియదు.
అప్పుడే మొదలైన వ్యతిరేకత..
సుశీలా కర్కికి వ్యతిరేకంగా నేపాల్‌లో కేవలం 3 రోజుల్లోనే వ్యతిరేకత మొదలైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే 3 రోజుల క్రితం ఆమె నియామకంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారు నేడు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నేపాలీ మీడియా ప్రకారం.. సుడాన్ గురుంగ్, వారి బృందం తాత్కాలిక ప్రధానిని వ్యతిరేకించడం ప్రారంభించినట్లు సమచారం. ఆది, సోమవారాల్లో గురుంగ్ బృందం ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలిపింది. ప్రధానమంత్రి కర్కి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వాళ్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై కూడా వాళ్లు సుశీలా కర్కిని వ్యతిరేకించారు.
READ ALSO: Israel Offer: ఇజ్రాయెల్ ఆఫర్‌కు భారత్ ఓకే చెప్తే.. పాక్ కథ ఎప్పుడో ముగిసేది!
