Site icon NTV Telugu

KP Sharma Oli: 18 రోజుల తర్వాత ప్రత్యేక్షమైన నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి..

Nepal

Nepal

Nepal Ex-PM KP Sharma Oli: నేపాల్ మాజీ ప్రధాన మంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. పార్టీ విద్యార్థి విభాగం, రాష్ట్రీయ యువ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన శనివారం భక్తపూర్ చేరుకున్నారు. భారీ నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. నిరసనల ప్రారంభంలో కేపీ ఓలిని నేపాల్ సైన్యం రక్షణలో ఉంచారు. తరువాత తాత్కాలిక నివాసానికి తరలించారు. తాజాగా పార్టీ సమావేశం అనంతరం కనిపించారు. యువతతో కనెక్ట్ అవ్వడానికి, రాజకీయ ప్రభావాన్ని కొనసాగించడానికి బయటికి వచ్చినట్లు చెబుతున్నారు.

READ MORE: Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ కేసులో పాకిస్తాన్ కోణం.. దర్యాప్తులో సంచలన విషయాలు..

కాగా.. జనరల్-జెడ్ హింస, ఒత్తిడి కారణంగా ఓలి ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. నిరసనల మధ్య ఆయనను ప్రధానమంత్రి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా రక్షించారు. పారదర్శకత, అవినీతిని అంతం చేయడం, సోషల్ మీడియా నిషేధాన్ని రద్దు చేయడం వంటి డిమాండ్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం త్వరగా హింసాత్మక నిరసనగా మారింది. ఇప్పటివరకు మొత్తం 74 మంది నిరసనకారులు మరణించారు. నిరసనల అనంతరం ప్రస్తుతం ఆయన స్థానంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు. అయితే.. తన ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకే కేపీ ఓలి ఇటువంటి పరిస్థితులలో తిరిగి వచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version