NTV Telugu Site icon

Nepal Bowler Yuvraj Khatri: అత్యుత్సాహం చూపిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది కాబోలు..

Nepal Bowler Yuvraj Khatri

Nepal Bowler Yuvraj Khatri

Nepal Bowler Yuvraj Khatri: ఆట ఏదైనా సరే.. విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవడం పరిపాటే. అయితే, ఆ సంబరాలు కాస్త శృతి మించితే మాత్రం అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే క్రికెట్ లో సెంచరీ చేసిన, వికెట్లు తీసిన, విజయం సాధించిన ఇలా ఏదైనా సందర్భం సరే.. కొందరు ఆటగాళ్లు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా

దుబాయ్ వేదికగా జరుగుతున్న U19 ఆసియా టోర్నీ ఐదో మ్యాచ్‌ లో బంగ్లాదేశ్, నేపాల్ అండర్-19 జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 141 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆకాష్ త్రిపాఠి అత్యధికంగా 43 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం 29 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో పడిన 5 వికెట్లలో స్పిన్నర్ యువరాజ్ ఖత్రీ 4 వికెట్లు తీశాడు. అయితే వీటిలో ఒక వికెట్ తీసిన సమయంలో అత్యుత్సాహం చూపడంతో అతను కాలు నొప్పితో విలవిలలాడాడు. ఇందుకు సంబంధిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా

17 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి కాస్త ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. ఇందులో మొదట ఫరీద్ హసన్‌ను బౌల్డ్ చేసి అతడు తన షూ విప్పి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికే మరో బ్యాట్స్‌మెన్‌ రిజాన్‌ హోసన్‌కు ఎల్‌బీడబ్ల్యూ అవుట్‌ చేసి పూర్తి ఉత్సాహంతో మైదానంలో లాంగ్‌ రన్‌ చేశాడు. ఆ సమయంలో తోటి ఆటగాళ్లతో సంబరాలు జరుపుకోవడం ప్రారంభించాడు. అయితే ఈ అతిఉత్సాహంలో అతని ఎడమ కాలు చీలమండ దగ్గర బాగా మెలితిరిగింది. దీనితో అతడు మైదానంలో అలాగే కూర్చుండిపోయాడు. దాంతో జట్టు ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి అతన్ని పరీక్షించారు. అక్కడ అతడి పరిస్థితి బాగాలేకపోవడంతో తోటి ఆటగాల్ల సహాయంతో యువరాజ్‌ని భుజంపై ఎత్తుకుని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.