Site icon NTV Telugu

Saleem Pistol arrest: నేపాల్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్.. ఐఎస్ఐతో కనెక్షన్స్

01

01

Saleem Pistol arrest: ఆయుధ స్మగ్లర్, ఐఎస్ఐతో, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్న సలీం పిస్టల్‌ను ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. ఆగస్టు 9న నేపాల్‌లో సలీంను అరెస్టు చేశారు. చాలా ఏళ్లుగా అతను పాకిస్థాన్ నుంచి ఆధునిక ఆయుధాలను అక్రమంగా ఇండియాకు రవాణా చేస్తున్నాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భద్రతా సంస్థల సహకారంతో షేక్ సలీం అలియాస్ సలీం పిస్టల్‌ను అరెస్ట్ చేసి, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కార్యాలయంలో ఉంచినట్లు సమాచారం.

READ MORE: Chevireddy: ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి హల్ చల్.. వాళ్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక..!

సలీం పిస్టల్ క్రైమ్ రికార్డ్స్..
సలీం పిస్టల్ ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను ఎనిమిదో తరగతి వరకు చదువుకొని, తర్వాత చదువును మానేసి డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అతను మొట్టమొదటిసారి నేర ప్రపంచంలోకి 2000 సంవత్సరంలో అడుగుపెట్టాడు. తన పార్ట్‌‌నర్ ముఖేష్ గుప్తా అలియాస్ కాకాతో కలిసి వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు దొరకడంతో ఫస్ట్ టైమ్ క్రైమ్ రికార్డ్స్‌లోకి అతని పేరు ఎక్కింది. 2011లో, సలీం జాఫ్రాబాద్‌లో రూ.20 లక్షల భారీ సాయుధ దోపిడీకి పాల్పడ్డాడు. 2013లో అతన్ని పోలీసులు పట్టుకుని, ఐపీసీ సెక్షన్లు 395, 397 కింద కేసు నమోదు చేశారు. అనంతర కాలంలో సలీం నేర ప్రపంచంలో ఎదుగుతూ.. పెద్ద ఆయుధ స్మగ్లర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. పోలీసుల దర్యాప్తులో సలీం టర్కిష్ తయారీ జిగానా పిస్టళ్ల స్మగ్లింగ్‌లో పేరుమోసిన వ్యక్తిగా తేలింది. ఈరకమైన పిస్టళ్లు భారతదేశంలోని గ్యాంగ్‌స్టర్లలో బాగా ఫేమస్ అయ్యాయి. ఈ ఆయుధాలను పాకిస్థాన్ నుంచి ఇండియాకు అక్రమంగా రవాణా చేయడంలో బులంద్‌షహర్‌లోని ఖుర్జాకు చెందిన ఇద్దరు సోదరులు సలీంకు సహాయం చేశారు. ఈ సోదరులిద్దరూ ముందుగా ఈ పిస్టల్స్‌ను పార్ట్స్‌గా విడదీసి వాహనాల్లో ఎవరికి అనుమానం రాకుండా, సరఫరా చేయించేవారు.

ఐఎస్ఐ, అండర్ వరల్డ్‌తో సంబంధాలు..
పలు ఏజెన్సీల నివేదికల ప్రకారం.. సలీంకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడి గురువుగా కూడా సలీం పేరు ప్రచారంలో ఉంది. లారెన్స్ బిష్ణోయ్, హషీం బాబా వంటి పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లకు కూడా సలీం ఆయుధాలను సరఫరా చేశాడు. సలీం పిస్టల్‌ను మొదటిసారిగా 2018లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చి, విదేశాలకు పారిపోయాడు. ఇక అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. చాలా సంవత్సరాలు పాకిస్థాన్ నుంచి ఆధునిక ఆయుధాలను అక్రమంగా ఇండియాకు రవాణా చేస్తున్నాడు. ఈక్రమంలో నేపాల్‌లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చారు.

READ MORE: South Central Railways : తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

Exit mobile version