NEET UG 2026: మెడికల్ చదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త. NEET UG 2026లో మంచి స్కోర్ సాధించే విద్యార్థులకు MBBS అడ్మిషన్లు లభించే అవకాశాలు పెరగనున్నాయి. 2026 అకడమిక్ నుంచి దేశవ్యాప్తంగా MBBS సీట్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొత్త మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)లోని మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) అకడమిక్ సెషన్ 2026–27 కోసం ప్రక్రియను ప్రారంభించింది.
‘కామెల్లియా సినెన్సిస్’తో తయారైనదే అసలైన ఛాయ్.. హెర్బల్ టీలు ఛాయ్ కాదు.. FSSAI స్పష్టీకరణ..!
దేశంలో MBBS సీట్లను పెంచడం, కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం కోసం కొత్త విధానాన్ని MARB అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటివరకు MARB నిబంధనల ప్రకారం ఒక మెడికల్ కాలేజీ 150 MBBS సీట్లకు మించి అడ్మిషన్లు ఇవ్వకూడదు. అయితే 2026–27 అకడమిక్ సెషన్‌కు మాత్రమే ఈ పరిమితికి మినహాయింపు ఇస్తున్నారు. కానీ, సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రతి 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్లు అనే నిష్పత్తిని కాలేజీ తప్పనిసరిగా పాటించాలి.
MBBS సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 50 సీట్లకు రూ.6.25 లక్షలు + 18% GST అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు అదనంగా ఉంటుంది. అలాగే కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు కూడా MARB దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు కలిగిన ఆసుపత్రులు, ట్రస్టులు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించవచ్చు. అందులో భాగంగా లీజుపై తీసుకున్న ఆసుపత్రులతో కూడా మెడికల్ కాలేజీలు ప్రారంభించవచ్చు. ఈ లీజ్ కాలం కనీసం 30 సంవత్సరాలు ఉండాలి.
Use a Nebulizer for Children: పిల్లలకు నెబ్యులైజర్ ఎప్పుడు, ఏం టైంలో పెట్టాలో తెలుసా..
దరఖాస్తులు NMC అధికారిక వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వేర్వేరు ఫీజులు నిర్ణయించారు. అలాగే MBBS సీట్ల సంఖ్య ఆధారంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. MARB తీసుకున్న ఈ నిర్ణయాలతో రాబోయే అకడమిక్ సెషన్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా MBBS సీట్లు పెరిగి, NEET UG 2026 అభ్యర్థులకు మరిన్ని అడ్మిషన్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
