NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పులాల చంద్రశేఖర్ NEET-UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. యూజీ కోర్సుల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8, 2026 నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కౌన్సెలింగ్ తేదీలను గమనించి గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
కౌన్సెలింగ్ మొదటి విడత అఖిల భారత కోటా (AIQ)లో ఆగస్టు 4 నుంచి 17 వరకు జరగనుండగా, చేరడానికి ఆగస్టు 22 చివరి తేదీ. రాష్ట్ర కోటాలో ఆగస్టు 13 నుంచి 22 వరకు జరిగి, చేరడానికి ఆగస్టు 28 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థుల వివరాల ధృవీకరణ AIQ కి ఆగస్టు 23న, రాష్ట్ర స్థాయికి ఆగస్టు 29న జరుగుతుంది.
Also Read
రెండో విడత కౌన్సెలింగ్ AIQ లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు (చివరి తేదీ సెప్టెంబర్ 8), రాష్ట్ర కోటాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు (చివరి తేదీ సెప్టెంబర్ 14) నిర్వహించనున్నారు.
మూడో విడత AIQ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు జరిగి, సెప్టెంబర్ 26 నాటికి చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటాలో సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు జరిగి, అక్టోబర్ 1 నాటికి చేరాల్సి ఉంటుంది.
చివరిగా స్ట్రే వేకెన్సీ రౌండ్ AIQ కి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు, రాష్ట్ర కోటాకు అక్టోబర్ 3 నుంచి 5 వరకు జరుగుతాయి. ఈ రౌండ్లో సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 10, 2026 లోపు నిర్దేశిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?