NTV Telugu Site icon

Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు నీరజ్‌ అర్హత.. పాకిస్తాన్ స్టార్ అర్షద్‌కు షాక్!

Neeraj Chopra Silver Medal

Neeraj Chopra Silver Medal

Neeraj Chopra qualifies for Diamond League Final: భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌కు అర్హత సాధించాడు. బ్రస్సెల్స్‌ వేదికగా సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. జూరిచ్‌ డైమండ్ లీగ్‌లో పాల్గొననప్పటికీ.. నీరజ్‌ 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్‌ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ (29 పాయింట్లు), జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ (21 పాయింట్లు), చెక్ రిపబ్లిక్‌ స్టార్ జాకుబ్ (16 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Also Read: Viral Videos: ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌లు.. భలేగా పట్టారు భయ్యో!

అయితే పారిస్ ఒలింపిక్స్‌ 2024లో 92.97 మీటర్లు ఈటెను విసిరి స్వర్ణం కైవసం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ డైమండ్ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించిన అర్షద్‌ అనర్హతకు గురయ్యాడు. నీరజ్‌ చోప్రాకు ఇప్పుడు ప్రధాన పోటీదారుడు లేడు. డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ ఇప్పటివరకు రెండు సీజన్లలో మాత్రమే బరిలోకి దిగాడు. దోహాలో 88.86 మీటర్లు, లుసాన్నెలో 89.49 మీటర్లు ఈటెను విసిరాడు. బ్రస్సెల్స్‌లోనైనా 90 మీటర్ల మార్క్‌ను అందుకోవాలని లక్ష్యంతో ఉన్నాడు.

Show comments