Site icon NTV Telugu

Tokyo: పాపం నీరజ్ చోప్రా.. సూపర్ సచిన్! జావెలిన్‌లో షాకింగ్ ట్విస్ట్..

Sachin Yadav Javelin

Sachin Yadav Javelin

Tokyo: జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలో ఒలింపిక్ బంగారు పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో 12మందితో పోటీపడిన నీరజ్‌ పేలవ ప్రదర్శన చేశారు. ఆయన ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్కు అందుకోలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. నీరజ్ తన మొదటి త్రోను 83.65 మీటర్ల దూరం విసిరాడు. మూడు, ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లు విసి కేవలం 8వ స్థానానికి పరిమితం అయ్యాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 82.73 మీటర్ల దూరం మాత్రమే విసిరి టోర్నీలో 10 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

READ ALSO: AP Assembly: ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం!

ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి.. ఆయనే సచిన్ యాదవ్.. ఏమాత్రం అంచనాలు లేకుండా భారత దేశం నుంచి బరిలోకి దిగిన ఈ వ్యక్తి నీరజ్ చోప్రాను మించి ప్రదర్శన చేశాడు. పాపం మనోడు కేవలం 40 సెంటీమీటర్ల తేడాతో పతకాన్ని కోల్పోయాడు. సచిన్ ఉత్తమంగా 86.27 మీటర్ల త్రో విసిరి టోర్నీ మొత్తంలో నాలుగో స్థానంలో నిలిచాడు.

విజేత ఎవరంటే..
కెషోర్న్ వాల్కాట్ (88.16 మీ) స్వర్ణం గెలవగా, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 87.38 మీ) రజతం సాధించాడు, అమెరికా అథ్లెట్ థాంప్సన్ 86.67 మీటర్లతో మూడో స్థానంలో నిలిచిన కాంస్య పతకం అందుకున్నాడు. భారతదేశానికి చెందిన సచిన్ 86.27 మీటర్ల నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

READ ALSO: Qatar Gift Plane: ఇది మామూలు విమానం కాదు.. ఎగిరే ప్యాలెస్‌లా అమెరికా అధ్యక్షుడి గిఫ్ట్

Exit mobile version