Neelam Bhardwaj Double century: ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం అనేక టోర్నమెంట్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. టోర్నీలో 18 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించింది. లిస్ట్ A క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఉత్తరాఖండ్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ సృష్టించారు. గతంలో ఈ రికార్డు శ్వేతా సెహ్రావత్ పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా సెహ్రావత్ కూడా డబుల్ సెంచరీ చేసింది. అయితే, తాజాగా భారత క్రికెట్‌లో ఉత్తరాఖండ్ క్రికెటర్ నీలం భరద్వాజ్ లిస్ట్ A క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించింది. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో నీలం భరద్వాజ్ 27 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేపట్టిన నీలం డబుల్ సెంచరీ చేసింది. లిస్ట్ ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఫీట్ సాధించిన భారతదేశం నుండి నీలం భరద్వాజ్ మాత్రమే రెండవ మహిళా.
Also Read: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!
నీలం భరద్వాజ్ కంటే ముందు, ఢిల్లీ తరపున ఆడుతున్న శ్వేతా సెహ్రావత్ జనవరి 2024లో నాగాలాండ్‌పై డబుల్ సెంచరీ చేసింది. అప్పుడు శ్వేతా సెహ్రావత్ 150 బంతుల్లో 242 పరుగులు చేసింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat) 19 ఏళ్ల వయసులో ఈ డబుల్ సెంచరీ సాధించింది. అయితే, ఈ రికార్డును తాజాగా నీలం భరద్వాజ్ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఉత్తరాఖండ్ బ్యాటింగ్ చేసింది. నీలం భరద్వాజ్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 371 పరుగులు భారీ స్కోర్ చేసింది. నీలంతో పాటు, నందిని కశ్యప్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 79 బంతుల్లో 81 పరుగులు చేసింది. అలాగే కంచన్ పరిహార్ కూడా 52 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యానికి సమాధానంగా నాగాలాండ్ జట్టు 47 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. దింతో ఉత్తరాఖండ్ 259 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.