NTV Telugu Site icon

Virus In Himalayas: హిమాలయ మంచు పొరల్లో వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు

Himalayas

Himalayas

Virus In Himalayas: హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయని తెలిపారు. సుమారు 17 వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను గుర్తించారు అమెరికన్ సైంటిస్టులు.. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుంచి పర్వతాల్లో ఆ వైరస్‌లను కనుగోన్నారు. కొన్ని వైరస్‌లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో సైంటిస్టుల టీమ్ ఆ వైరస్‌‌పై పరిశోధన చేసింది. నేచర్ జియోసైన్స్ జర్నల్ లో నివేదికను ప్రచురుంచింది. శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే.. ఆ వాతావరణానికి తగినట్లుగా ఆ వైరస్ ఎలా తట్టుకుంది అనే విషయాలను ఆ నివేదికలో వెల్లడించింది.

Read Also: Aravind Kejriwal : నేడు కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

కాగా, వేల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మంచుగడ్డల్లోని పొరలను అధ్యయనం చేసేందుకు ఐస్ కోర్‌లను డ్రిల్ చేసి తీసిన శ్యాంపిల్స్‌ను అమెరికన్ శాస్త్రవేత్తలు పరీక్షించారు. గులియా గ్లేసియర్‌లోని సుమారు 310 మీటర్ల లోతైన ఐస్ కోర్ నుంచి మంచు శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్ చేశారు. ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. నూతన టెక్నాలజీ ద్వారా వైరస్‌లకు చెందిన డీఎన్ఏలను పరీక్షించగా.. సుమారు 1705 రకాల విభిన్న వైరస్ జాతులను యూఎస్ సైంటిస్టులు గుర్తించారు.