Site icon NTV Telugu

Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమేనా?

Vice President Election

Vice President Election

Vice President election: ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. విపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు పలకాలని చర్చలు మొదలు పెట్టారు కమలనాథులు. ప్రతిపక్ష నేతల మద్దతు కోసం వాళ్లతో చర్చించడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.

సెప్టెంబర్ 9 న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుంది. ఆగస్టు 21 నామినేషన్లకు చివరి రోజు. దాంతో ఇప్పటికే ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై ఎన్డీయే కూటమిలో ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఉండవు కూడా. అయితే తమ అభ్యర్థి గెలుపు కోసం కావాల్సిన పూర్తి మెజారిటీ తమకు ఉన్నప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా ప్రయత్నాలు చేస్తుంది ఎన్డీయేలో పెద్దన్న కమలం పార్టీ.

Oppo F31 series: 7,000mAh బ్యాటరీ, 360-డిగ్రీ ఆర్మర్ బాడీతో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకరానున్న ఒప్పో!

పార్లమెంట్ లో ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు అప్పగించారు. ఇప్పటికే రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ నేతలతో మాట్లాడారు. అయితే అభ్యర్థిని పెట్టే విషయంలో ఇంకా ఇండియా కూటమి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఓడినా సరే తమ అభ్యర్థిని బరిలో దించాలనే అభిప్రాయాన్ని ఇండియా కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ, ఉభయ సభల్లో ఏ కూటమికెంత బలం?
ప్రస్తుతం పార్లమెంట్ లో అధికారపక్షం ఎన్డీయే కూటమిగా, ప్రతిపక్షం ఇండియా కూటమిగా ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు బిఆర్ఎస్, వైఎస్ఆర్సిపిలు న్యూట్రల్ గా ఉన్నాయి. న్యూట్రల్ గా ఉన్న పార్టీలు పరిస్థితులు నిర్ణయాలకు అనుగుణంగా సభలో సమయాన్ని బట్టి వ్యవహరిస్తున్నాయి. లోక్ సభలో మొత్తం 543 లో ఒక సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో 5 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత ఎలక్ట్రోరల్ లో 782 మంది ఎంపీలు. 782 ఎంపీల్లో లోక్ సభ నుంచి 542, రాజ్యసభ నుంచి 240 మంది ఉన్నారు.

Virat Kohli: లండన్ వీధుల్లో భార్యతో కలిసి స్వేచ్ఛగా షికార్లు కొడుతున్న కోహ్లీ.. వీడియో వైరల్

ఎన్డీయేకు లోక్ సభలో 293 రాజ్యసభలో 132 మంది మద్దతు నేరుగా ఉంది. ఇండియా కూటమి లోక్ సభలో 234 రాజ్యసభలో 77 మంది మద్దతు నేరుగా ఉంది. మరో పక్క ఉభయ సభల్లో కలిపి 46 మంది ఎంపీలు ఎటు వైపు లేరు. న్యూట్రల్ గా ఉన్న ఎంపీలను తమ అభ్యర్థికి ఓటు వెయ్యాలని ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీయే.

Exit mobile version