MP Sanjay Singh: నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ జోస్యం చెప్పుకొచ్చారు. ఎన్డీయే మిత్రపక్షాల అంచనాలను అందుకోవడంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇక, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సంజయ్ సింగ్.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఏడాది వరకు మాత్రమే కొనసాగుతుందన్నారు. అంతకంటే ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు. భాగస్వామ్య పార్టీలు ఆశించిన విధంగా మోడీ పని చేయబోడు.. రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే తన వైఖరిని ఆయన కొనసాగిస్తారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
Read Also: Train Accident: వందే భారత్- జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్లకు తప్పిన ప్రమాదం..
ఎన్డీయే కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలే స్పీకర్‌ను తయారు చేసుకోవాలి లేదంటే ఈ రెండు పార్టీల నుంచి ఎంత మంది భారతీయ జనతా పార్టీలో చేరుతారో చెప్పలేమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సలహా ఇచ్చారు. ఎన్డీయే కూటమి పార్టీలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కాగా, మోడీ 3.0 ప్రభుత్వం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆయనతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఈ మీటింగ్ లోనే మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంటుంది.