NTV Telugu Site icon

NDA Alliance: ఏపీ సీఈఓతో ఎన్డీఏ కూటమి నేతల భేటీ.. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఫిర్యాదు

Ap

Ap

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్ ఎంకే మీనాతో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఏపీ సీఈఓను వర్ల రామయ్య, బండ్రెడ్డి రామకృష్ణ, పాతూరి నాగభూషణం నేతృత్వంలోని ఎన్డీఏ బృందం కలిసింది. ఈ మీటింగ్ లో ప్రధాని పాల్గొన్న ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు చేసింది. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్డీఏ కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు పండితులు మృతి

ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినా కొందరు పోలీసులు బరితెగించి వ్యవహరిస్తున్నారు.. ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభను చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించారు.. ప్రధాని సభ అనుకున్నారా..? దారిన పోయే దానయ్య సభ అనుకున్నారా?.. ప్రధాని వస్తున్నారన్నా.. కనీస భద్రత కూడా ఏర్పాటు చేయలేదు.. గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు కంటే కానిస్టేబుల్ నయం.. ఎన్నికల విధుల నుంచి డీఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు రేంజ్ ఐజీ, పల్నాడు ఎస్పీలను విధుల నుంచి తొలగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలు వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేయిస్తారు అంటూ ఆరోపించారు.

Read Also: Supreme Court: హిమాచల్‌ ప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్.. స్టేకు నిరాకరణ

ఇక, బీజేపీ ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. ప్రధాని రిసీవింగ్ దగ్గర నుంచి పాసుల వరకు పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. ప్రధానికి ఙాపికలను ఇవ్వడానికి కూడా అనుమతివ్వలేదు.. పల్నాడు ఎస్పీ మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. అలాగే, జనసేన ప్రతినిధి బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని సభలో ప్రొటోకాల్ విఫలమయ్యారు.. ఎన్నికల విధులు శాంతియుతంగా జరగాలంటే భద్రతా లోపాలకు కారణమైన ఉన్నతాధికారులను తప్పించాలి.. ప్రధాని సభకు భద్రతను దగ్గరుండి చూసుకోవాల్సిన పల్నాడు ఎస్పీ రాకపోవడమేంటీ..? అని ఆయన ప్రశ్నించారు.

Show comments