Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్ మౌలాలిలో డ్రగ్ తయారీ కేంద్రంపై సోదాలు నిర్వహించింది. రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. 69.600 కిలోల అల్ప్రజోలామ్‌ను స్వాధీనం చేసుకుంది. ఎఫెడ్రిన్ డ్రగ్ తయారీ ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో రెండు ప్లాస్టిక్ డ్రమ్ములలో భారీగా డ్రగ్ మెటీరియల్ నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. రెండు డ్రమ్ముల నుండి మొత్తం 69.600 కిలోల ఆల్ప్రజోలామ్ను గుర్తించారు. ఆల్ప్రజోలామ్తో పాటు, ఆల్ప్రజోలామ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఎఫెడ్రిన్ కోసం వాడే రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కెమిస్ట్, మెటీరియల్ సప్లై చేసే వ్యక్తి, మెటీరియల్ తరలించే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఆల్ప్రజోలామ్ను వేసవిలో అధిక డిమాండ్ ఉండే తెలంగాణలోని కల్లు దుకాణాలకు విక్రయించనున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురి నిందితులపై NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. అల్ప్రజోలామ్ (Alprazolam) వంటి మత్తు బిళ్ళలను కల్లులో కలపడం తీవ్రమైన నేరం. కల్లులో నిషా పెంచడానికి కొందరు అక్రమంగా ఈ బిళ్ళలను కలుపుతుంటారు. ఇలా కల్లును కల్తీ చేయడం ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి.. అల్ప్రజోలామ్ ఒక సెడెటివ్ డ్రగ్ (నిద్ర కోసం వాడే మందు). దీనిని ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్నప్పుడు మెదడు, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కలయిక వల్ల శ్వాస ఆగిపోవడం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మోతాదు ఎక్కువైతే మనిషి కోమాలోకి వెళ్లవచ్చు లేదా మరణించవచ్చు.
Also Read
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
- Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
తాజావార్తలు
-
Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?