నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఈ మధ్య కాలంలో ఈయన మరింత జోరుగా ముందుకు వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంటున్నాడు బాలయ్య.ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ ను విడుదల చేసారు.ట్రైలర్ లో బాలయ్య మాస్ డైలాగ్స్తో అదరగొట్టాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది. ఈ సంవత్సరం దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. దీంతో బాలయ్య ఇటీవలే తన పుట్టిన రోజు నాడు మరో కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేసారు.
ఆ రోజే ఆ సినిమాను లాంచ్ కూడా చేసారు.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నాడు.. బాలయ్య నటిస్తున్న ఈ సినిమా తన 109 వ సినిమాగా రాబోతుంది. దర్శకుడు బాబీ తో సినిమా ప్రకటించగానే ఈ కాంబో పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాబీ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నట్టు సమాచారం.ఇటీవలే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య వంటి భారీ హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో కూడా ఒక మాస్ సినిమా తీసి హిట్ అందుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూట్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ పై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతుంది అని సమాచారం.వచ్చే సంవత్సరం ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందనీ తెలుస్తుంది..
