NBK 109 : భారీ యాక్షన్ సీన్స్ తో మొదలు కానున్న బాలయ్య తరువాత సినిమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య తన 109వ సినిమాను తన బర్త్‌డే సందర్బం గా అఫిషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ గా పెరిగి పోయాయి.దర్శకుడు బాబీ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సారి ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో కూడా ఒక పవర్ ఫుల్ సినిమా తీసి హిట్ అందుకోవాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చినట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ సంబంధించి మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లో ముందుగా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తుంది.. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం పూర్తి సెట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.ఈ సెటప్ మొత్తం రెండు వారాల్లో పూర్తి కానుందని ఆ తర్వాత ఆ సెట్ లో షూట్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.తండ్రి కొడుకులుగా బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం. బాలయ్య అలాంటి పాత్రలు చాలానే చేసారు. మరీ బాబీ తన సినిమాలో బాలయ్యను ఎలా చూపిస్తాడో వేచి చూడాలి..ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందించబోతున్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!