Site icon NTV Telugu

Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’ కోసం లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ..

Saraswathi Movie

Saraswathi Movie

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సరస్వతి’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్‌ను వరలక్ష్మి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను లేడీ సూపర్ స్టార్ నయనతార విడుదల చేయనున్నారు.

Also Read : #Mega158: మెగాస్టార్-బాబీ సినిమాలో బండ్ల గణేష్.. రోల్ ఏంటో తెలుసా..?

నయనతార వంటి స్టార్ హీరోయిన్ తన సినిమా పాటను లాంచ్ చేయడంపై వరలక్ష్మి ఎంతో ఎగ్జైట్‌మెంట్‌గా ఉన్నారు.. ‘మా క్వీన్ నయనతార మార్చి 1వ తేదీ ఉదయం 10:04 గంటలకు ‘సరస్వతి’ ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయబోతున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా పట్ల, ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు మేడమ్’ అంటూ వరలక్ష్మి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే థమన్ – వరలక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్’ వంటి సినిమాల పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ‘సరస్వతి’తో మరోసారి వీరిద్దరూ మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. నయనతార చేతుల మీదుగా విడుదల కాబోతున్న ఈ పాట సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Exit mobile version