Site icon NTV Telugu

Nayanthara : యష్ కోసం తగ్గిన లేడీ సూపర్‌స్టార్.. టాక్సిక్ పారితోషికం లీక్!

Nainatara

Nainatara

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార, హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు కన్నడ సూపర్‌స్టార్ యష్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. గన్ పట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం నయనతార తీసుకున్న పారితోషికం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Also Read : Sneha: మంచానికే పరిమితం అయిన.. హీరోయిన్ స్నేహ

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘టాక్సిక్’ సినిమా కోసం నయనతార మొదట ఏకంగా రూ.18 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, చిత్ర నిర్మాతలతో జరిగిన చర్చల అనంతరం ఆమె రూ.12 కోట్ల రూపాయలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్లకు దూరంగా ఉన్నప్పటికీ, కేవలం తన నటన స్టార్ ఇమేజ్‌తో సినిమాకు భారీ హైప్ తీసుకురాగల నయనతారకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్ వంటి మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా నటిస్తున్నప్పటికీ, నయనతార పాత్రే హైలైట్ కానుందని సమాచారం.

Exit mobile version