బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “జవాన్”. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అయిన అట్లీ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను రెడ్ చిల్లీస్ పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్. జవాన్ టీజర్ జులై 7న విడుదల చేయబోతున్నారు. అయితే టీజర్ కోసం షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక వీడియో లీకై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో హీరోయిన్ నయనతార కు సంబందించిన లుక్ లీక్ అయింది.. పింక్ సూట్ లో ఉన్న నయనతార లుక్ అదిరిపోయింది..ఎంతో అట్రాక్టీవ్ గా కనిపిస్తున్న నయనతార లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇక జవాన్ సినిమాను సెప్టెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ అండ్ వీడియోస్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అయిన అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే..అలాగే రీసెంట్ గా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఎన్నో ఏళ్ల తరువాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో తన రేంజ్ కు తగ్గ హిట్ కొట్టాడు. ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.