Site icon NTV Telugu

Navneet Dhaliwal: 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్..!

Navneet Dhaliwal

Navneet Dhaliwal

Navneet Dhaliwal Retirement: కెనడా క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన మాజీ కెప్టెన్ ‘నవనీత్ ధలివాల్’ (Navneet Dhaliwal) అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆఫ్గనిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్ అనంతరం తన 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ కు ముగింపు పలికినట్లు ప్రకటించాడు. కెనడా సూపర్-8 దశకు చేరుకోలేకపోవడంతో ఈ టోర్నీనే తన చివరి అంతర్జాతీయ పోటీగా ధలివాల్ ముందుగానే నిర్ణయించుకున్నాడు.

Varun Chakravarthy Love Story: “నువ్వు క్రికెట్ ఆడు.. నేను సంపాదిస్తాను” మిస్టరీ స్పిన్నర్ క్యూట్ లవ్ స్టోరీ!

37 ఏళ్ల నవనీత్ ధలివాల్ 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. కెనడా టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతను మొత్తం 48 టీ20 మ్యాచ్‌ల్లో 1305 పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా 29 టీ20 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించి 21 విజయాలు అందించాడు. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా జట్టుకు కీలక పాత్ర పోషించాడు.

టీ20 వరల్డ్ కప్‌లో ధలివాల్ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో కెనడా తొలిసారి అర్హత సాధించినప్పుడు కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ప్రారంభ మ్యాచ్‌లోనే 44 బంతుల్లో 61 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2026 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికాపై 49 బంతుల్లో 64 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ ను చూపించాడు. మొత్తం ఈ టోర్నీలో 108 పరుగులు సాధించాడు.

India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్‌గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?

నవనీత్ ధలివాల్ భారత్ లో ఉన్న మొహాలీకి చెందినవాడు. అక్కడే క్రికెట్ నేర్చుకున్న తర్వాత కెనడాకు వెళ్లి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. రిటైర్మెంట్ సందర్భంగా ధలివాల్ మాట్లాడుతూ.. “నేను వరల్డ్ కప్‌కు రాకముందే ఇది నా చివరి టోర్నీ అని నిర్ణయించుకున్నాను. 2024 వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం, కెప్టెన్ కావడం, ఆ టోర్నీలో రాణించడం నా జీవితంలో అత్యంత గర్వకారణమైన క్షణాలు” అని అన్నాడు.

క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, ఈ క్రీడతో తన అనుబంధాన్ని కొనసాగించాలని ధలివాల్ నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు కోచింగ్ వైపు వెళ్లాలని భావిస్తున్నాడు. కెనడాలో క్రికెట్‌కు సరైన వసతులు లేకపోయినా.. యువ ఆటగాళ్లలో మంచి ప్రతిభ ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం తన తదుపరి లక్ష్యమని తెలిపాడు.

Exit mobile version