NTV Telugu Site icon

Navjot Singh Sidhu: ఆ పనికి ఒక్క మ్యాచ్ కు రూ. 25 లక్షలా..?

3

3

టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు దశాబ్ద కాలం విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నాడు సిద్ధూ. మరో 2 రోజుల్లో మొదలు కాబోతున్న ఐపీఎల్‌ 2024 సీజన్‌ తో వ్యాఖ్యాతగా సిద్ధూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్వర్క్ వెల్లడించింది. నిజానికి సిద్ధూ కామెంటరీ కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. సిద్ధూ ఉన్నంతసేపు కామెంటరీ బాక్స్‌ లో ఆయన శైలిలో పంచ్‌ లు, ప్రాసలు, ఛలోక్తులతో నవ్వులు పూయిస్తాడు.

Also Read: Tirumala: నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

ఈ సందర్బంగా.. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చే టీ20 ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేయడానికి భారత్‌ తోపాటు అన్ని దేశాలకు బాగా పనికి వస్తుందని నవ్‌జ్యోత్ సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రపంచం దృష్టి అంతా ఐపీఎల్‌ పైనే ఉందని., ఐపీఎల్‌ రూపంలో భారత ఆటగాళ్లతోపాటు విదేశీ ఆటగాళ్లకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఇక్కడ తమ ప్రతిభను చూపిస్తే వచ్చే టీ20 ప్రపంచకప్‌ లో జట్టుకు సులువుగా ఎంపిక కావొచ్చని సిద్ధూ చెప్పుకొచ్చాడు.

Also Read: Warangal – Ice Cream: వరంగల్ లో దారుణం.. ఐస్ క్రీమ్ లో వీర్యం..!

తాను క్రికెట్‌ లోకి 20 సార్లు పునరాగమనం చేశానాని.. కాకపోతే కామెంటేటర్‌ గా మాత్రం ఇదే ఫస్ట్ కమ్ బ్యాక్‌ అని తెలుపుతూ.. క్రికెట్ నా ఫస్ట్ లవ్‌. మన అభిరుచి మన వృత్తిగా మారితే దానికంటే గొప్పది మరొకటి ఉండదు అని చెప్పుకొచ్చాడు. ఇంతకాలం గ్యాప్‌ వచ్చినా నాలో మాటల పదును ఏమి తగ్గలేదని.. అదికూడా త్వరలోనే మీకర్థమవుతుందని చెప్పుకొచ్చాడు. వ్యాఖ్యాతగా కెరీర్‌ ను మొదలుపెట్టినప్పుడు తనకి కాన్ఫిడెంట్‌ లేదని.. కానీ, ప్రపంచ కప్‌ లో అదరగొట్టడం అభిమానులతోపాటు నన్ను ఆశ్చర్చపరిచింది. ఇదివరకు టోర్నీ మొత్తం కామెంట్రీ చేస్తే.. తమికి రూ. 60-70 లక్షల పారితోషికంగా ఇచ్చేవారని.. కానీ.. నేను ఐపీఎల్‌ లో రోజుకు రూ. 25 లక్షలు తీసుకుంటున్నని సిద్ధు పేర్కొన్నాడు.