Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలతో తమ కుటుంబానికి గత 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని ఆయన తెలిపారు. అన్ని కులాలు, మతాల వారితో తమకున్న సంబంధాల కారణంగానే ప్రజలు తనను ఒక సెక్యులర్ నాయకుడిగా భావించారని అన్నారు. అందుకే 2014లో MIM పార్టీ తరఫున పోటీ చేసినా.. ప్రజలు తనకు మంచి మెజారిటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచేలా చేశారని గుర్తు చేశారు.
Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
బీజేపీ నేత బండి సంజయ్ తనను ‘నవీన్ ఖాన్’ అని సంబోధించడంపై నవీన్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారూ.. ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చూపించి ఓట్లు అడగండి. అంతేగానీ ఇక్కడ ఉన్న హిందువులు, ముస్లింల మధ్య మతకల్లోలాలు సృష్టించే విధంగా మాట్లాడొద్దు అని ఆయన అన్నారు. ఇక్కడ బస్తీల్లో అందరూ అన్నాతమ్ముల్లాగా కలిసి ఉంటే ఈ ప్రాంతం కబరస్థాన్ (శ్మశానం) ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేం కులమతాలకతీతంగా అన్ని పండగలను కలిసి జరుపుకుంటాం. రంజాన్, క్రిస్మస్, దసరా, బతుకమ్మ, సంక్రాంతి.. అన్ని పండుగలను హిందూ, ముస్లింలు అందరం కలిసి జరుపుకుంటాం. ఇక్కడ సెక్యులర్ వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలకు కులాలు, మతాల పైన ఎలాంటి ఆలోచనలు లేవని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
Classic 650 Launch: సరికొత్త స్టైలిష్ లుక్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్..
బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్‌ఎస్ వాళ్ళు నన్ను రౌడీ, గూండా అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ వాళ్లు కులమతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఈ రెండు పార్టీలూ కలిసి లేనిపోని ఆరోపణలు చేస్తూ తనను ఓడగొట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా తాము ఎక్కడా ఏ ఒక్క వసూళ్లకు కూడా పాల్పడిన దాఖలాలు లేవని.. వసూళ్లకు పాల్పడటం తమ నైజం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టడం తమ రక్తంలోనే లేదని నవీన్ యాదవ్ అన్నారు. తాను గెలిస్తే ఎలాంటి టాక్స్‌లు ఉండవు. పేదోడు ప్రశాంతంగా ఉండాలనేదే మా యొక్క ఆలోచనని భరోసా ఇచ్చారు. చివరగా, జూబ్లీహిల్స్ ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
