Naveen Patnaik Hospitalized: బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ప్రతిపక్ష నాయకుడు 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వయసు రీత్యా వచ్చిన సమస్యలతో ఆయన చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి పార్టీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన భువనేశ్వర్‌లోని ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, జగన్నాథుడి ఆశీస్సులు, ఒడిశా ప్రజల ప్రేమతో ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పోస్ట్‌లో పేర్కొంది.
READ MORE: Kethika Sharma : బాబోయ్.. ఇవేం అందాలు కేతిక
ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యంత్రాంగం మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్ ఆసుపత్రిలో చేరారనే వార్త బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురయ్యారు. అనేక మంది రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఇటీవల ముంబయిలో సర్వికల్ ఆర్థరైటిస్కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన కొన్ని రోజులు నిపుణుల పర్యవేక్షణలో గడిపారు. ప్రస్తుత ఆయన అనారోగ్యం మరోసారి పార్టీ కార్యకర్తలలో ఆందోళనను రేకెత్తించింది.
