నేటి బిజీ లైఫ్ లో స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన (ఆంక్సైటీ) సాధారణ సమస్యలుగా మారాయి. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ఈ సమస్యలకు కారణమవుతుంటాయి. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఔషధాలు లేకుండా, సహజ మార్గాలతో ఇవి నియంత్రించవచ్చని వెల్లడిస్తున్నారు. ఇవి మీ మూడ్‌ను మెరుగుపరచి, ఎండార్ఫిన్స్ (సంతోష హార్మోన్స్) పెంచుతాయంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే (నిద్ర లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు) వెంటనే డాక్టర్ లేదా మానసిక వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఈ సహజ మార్గాలు సపోర్ట్‌గా ఉపయోగపడతాయి, పూర్తి చికిత్స కాదని తెలిపారు.
వ్యాయామం
రోజూ 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా లేదా డ్యాన్స్ చేయండి. వ్యాయామం ఎండార్ఫిన్స్ విడుదల చేసి, స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. అధ్యయనాల ప్రకారం వారానికి 2-3 రోజులు ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ స్ట్రెస్, డిప్రెషన్ లక్షణాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఉదయం పార్క్‌లో నడకకు వెళ్లండి. పచ్చదనం, సూర్యకాంతి సెరోటోనిన్ (సంతోష హార్మోన్) పెంచుతాయి.
ధ్యానం & మైండ్‌ఫుల్‌నెస్
రోజూ 5-10 నిమిషాలు ధ్యానం చేయండి. ఊపిరి మీద దృష్టి పెట్టండి. మైండ్‌ఫుల్‌నెస్ బేస్డ్ స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్ ఆందోళనను తగ్గించి, మెదడు ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. యోగా కూడా అదే పని చేస్తుంది. కళ్లు మూసుకొని 4 సెకన్లు ఊపిరి లోపలికి తీసుకోండి, 4 సెకన్లు ఉంచండి, 4 సెకన్లు బయటకు వదలండి (4-4-4 బ్రీతింగ్).
ఆరోగ్యకరమైన ఆహారం & న్యూట్రిషన్
ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (వాల్‌నట్స్, ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్) – డిప్రెషన్ తగ్గిస్తాయి.
బెర్రీస్, ఆకు కూరలు, బాదం, డార్క్ చాక్లెట్ (చిన్న ముక్క) -స్ట్రెస్ హార్మోన్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.
కెఫీన్ & సుగర్ తగ్గించండి. చమోమైల్ టీ లేదా లెమన్ బామ్ టీ తాగండి – రిలాక్సేషన్ ఇస్తాయి.
రోజూ అరటి పండు, కుంకుమ పువ్వు (సఫ్రాన్) టీ లేదా మిల్లెట్స్ ఆహారంలో చేర్చండి.
నిద్ర
రోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర లోపం స్ట్రెస్‌ను పెంచుతుంది. రాత్రి స్క్రీన్ టైమ్ తగ్గించి, ఫిక్స్‌డ్ స్లీప్ షెడ్యూల్ పాటించండి.
నేచర్ & సోషల్ కనెక్షన్
పార్క్‌లో సమయం గడపండి లేదా పెట్స్‌తో ఆడండి -ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్) పెరుగుతుంది.
స్నేహితులు/కుటుంబంతో మాట్లాడండి.
ఆందోళన నుంచి బయటపడడానికి
డీప్ బ్రీతింగ్.. ఆందోళన వచ్చినప్పుడు 4-7-8 బ్రీతింగ్ (4 సెకన్లు ఇన్, 7 సెకన్లు హోల్డ్, 8 సెకన్లు అవుట్).
భయాలు రాసి వాటిని చాలెంజ్ చేయండి.
సంగీతం వినండి లేదా కామెడీ చూడండి – స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి.
