Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!

Natural Home Remedy

Natural Home Remedy

Natural Home Remedy: ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరవడం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, కెమికల్ ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీంతో చాలామంది హెయిర్ డైలు, కెమికల్ కలర్స్ వాడుతుండడంతో.. అవి జుట్టుకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అయితే సహజంగా జుట్టు రంగును మెరుగుపరచాలనుకునేవారికి ఒక సింపుల్ హోమ్ రెమెడీ మంచి పరిష్కారంగా మారుతోంది.

కొబ్బరి నూనె, కాఫీ పొడి, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ నేచురల్ మిక్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు నెరవడాన్ని తగ్గించడంలో, సహజమైన రంగును క్రమంగా మెరుగుపరచడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెమెడీలో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుకు పోషణ అందించి హెయిర్ రూట్స్‌ ను బలపరుస్తుంది. కాఫీ పొడిలో ఉండే సహజ రంగు జుట్టుకు డార్క్ టోన్ ఇవ్వడంలో సహాయపడుతుంది. నిమ్మరసం తల చర్మాన్ని శుభ్రపరచి హెయిర్ గ్రోత్‌కు ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్థాలు:
* 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
* 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీ పొడి
* అర్ధ నిమ్మకాయ రసం

తయారీ విధానం:
మొదట ఒక చిన్న గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో గ్రౌండ్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అర్ధ నిమ్మకాయ రసం జోడించి మూడు పదార్థాలను పేస్ట్‌లా అయ్యే వరకు మిక్స్ చేయాలి. జుట్టు పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని రూట్స్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేయాలి. అలా మెల్లగా మసాజ్ చేస్తూ తలకు పట్టించాలి. దాదాపు 30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. కావాలంటే గంట వరకు కూడా ఉంచవచ్చు. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ రెమెడీని వారానికి ఒకసారి ఉపయోగిస్తే కొన్ని వారాల్లో జుట్టులో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఇది పూర్తిగా సహజ రెమెడీ కాబట్టి.. ఫలితాలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండకపోవచ్చు. మీకు ఏదైనా అలర్జీ సమస్యలు ఉంటే ముందుగా పాచ్ టెస్ట్ చేయడం మంచిది. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.