Site icon NTV Telugu

National Sports Bill: సంచలన నిర్ణయం.. జాతీయ క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ..

Bcci

Bcci

National Sports Bill: భారత క్రీడా పరిపాలనలో భారీ మార్పు రాబోతోంది. ప్రభుత్వం పార్లమెంటులో జాతీయ క్రీడా పాలన బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీని పరిధిలోకి వస్తుంది. అంటే, ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా ఉన్న బీసీసీఐ ఇప్పుడు ఈ సంస్థ కిందకు వస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖకి చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత అన్ని జాతీయ సమాఖ్యల మాదిరిగానే.. బీసీసీఐ కూడా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

READ MORE: Kingdom : కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?

బీసీసీఐ 1926లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌లో చేరింది. అనంతరం అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌గా మారింది. ఇది భారత ప్రభుత్వ భారత జాతీయ క్రీడా సమాఖ్య పరిధిలోకి రాదు. ఎందుకంటే.. బీసీసీఐ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ సంస్థ. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి గ్రాంట్స్ పొందదు. 2019 సంవత్సరం వరకు.. బీసీసీఐని జాతీయ క్రీడా సమాఖ్య (NSF)గా పరిగణించలేదు. అయితే.. ఇది 2020లో ఆర్టీఐ చట్టం పరిధిలోకి వచ్చింది.

READ MORE: Supreme Court: ‘‘కన్స్యూమర్ ఈస్ కింగ్’’.. కస్టమర్లకు హోటళ్ల వివరాలు తెలుసుకునే హక్కు ఉంది..

ప్రస్తుతానికి చర్చనీయాంశంగా ఉన్న ప్రధాన అంశం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల వయోపరిమితి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ జూలై 19న 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. 70 ఏళ్లు నిండిన ఏ ఆఫీస్ బేరర్ అయినా బాధ్యత నుంచి తప్పుకొవాల్సి ఉంటుంది. అయితే, కొత్త క్రీడా బిల్లు ముసాయిదా జాతీయ క్రీడా సమాఖ్యలలో నిర్వాహకుల గరిష్ట వయోపరిమితిని 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, బిన్నీ తన పదవీకాలాన్ని కొనసాగించడానికి ఇది అనుమతించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version