Site icon NTV Telugu

DSP Ajay Pratap Singh: రూ.2.5కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్‌ఐఏ డీఎస్పీ.. అరెస్ట్ చేసిన సీబీఐ..

Dsp Ajay Pratap Singh

Dsp Ajay Pratap Singh

తనను ఇరికిస్తానని బెదిరించి రూ.2.5 కోట్లు డిమాండ్ చేసిన ఎన్ఐఏ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ సహా ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ వివరాల ప్రకారం.. బీహార్ రాజధాని పట్నాలో ఎన్ఐఏ యూనిట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పని చేస్తున్న అజయ్ ప్రతాప్‌సింగ్.. లైసెన్స్ లేని ఆయుధాలు సరఫరా చేస్తున్నారని చెప్పి ఓ కుటుంబం నుంచి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయగా.. సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో రూ.20 లక్షల విలువైన లంచం నగదుతో పాటు పలు అభ్యంతరకర పత్రాలు, డిజిటల్ వస్తువులు స్వాధీనం చేసుకుంది.

READ MORE: Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!

వాస్తవానికి సెప్టెంబర్ 19న నగరంలోని ఏపీ కాలనీలో ఉన్న జేడీయూ మాజీ ఎమ్మెల్సీ మనోరమా దేవి ఇంటిపై ఎన్‌ఐఏ బృందం దాదాపు 18 గంటల పాటు సోదాలు నిర్వహించింది. మనోరమా దేవి ఇంట్లో ఎన్‌ఐఏ 4.3 కోట్ల రూపాయల నగదు, అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఎన్ఐఏ పాట్నా బ్రాంచ్ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. నక్సలైట్ కేసులో ఇరికిస్తామని బెదిరించి మాజీ ఎమ్మెల్సీ మనోరమ్ దేవి, ఆమె పెద్ద కుమారుడు రాకీ యాదవ్‌ల నుంచి ఎన్‌ఐఏ డీఎస్పీ రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. దీంతో రాకీ యాదవ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు.

READ MORE: Vijayawada Durga Prasadam: దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి వెనక్కి పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

సెప్టెంబర్ 26న బాధితుడి నుంచి సింగ్.. రూ. 25 లక్షలు ముట్టచెప్పాలని డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ఉన్న మరొకరి మొబైల్ సాయంతో చెల్లించాల్సిన డబ్బులు, వివరాలను మెసేజ్ రూపంలో పంపాడు. డబ్బులు సమకూర్చాక అదే నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పాడు. అలా రూ.25 లక్షలు ఔరంగాబాద్‌కు చెందిన ఓ మధ్యవర్తికి అందాయి. అక్టోబర్ 1న యాదవ్‌ను సింగ్ మళ్లీ పిలిపించాడు. రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సిబిఐ బృందం అర్ధరాత్రి మనోరమ్ దేవి ఇంటి నుంచి 20 లక్షల రూపాయల లంచంతో గయ నుంచి డీఎస్పీకి చెందిన ఇద్దరు ఏజెంట్లను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. అదే సమయంలో.. ఎన్‌ఐఏ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్‌ను కూడా పాట్నా నుంచి అరెస్టు చేశారు.

Exit mobile version