NTV Telugu Site icon

NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు..ఎప్పుడంటే..?

Neet

Neet

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBE) నీట్-పీజీ (NEET PG 2024) పరీక్ష తేదీని ప్రకటించింది. ఎన్బీఈ పరీక్ష తేదీని జులై 5న విడుదల చేసింది. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుంది. నీట్ పీజీ పరీక్షలు 23వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షకు ఒక రోజు ముందు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షా ప్రక్రియ, పటిష్టతను తనిఖీ చేసి, ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందకే రద్దు చేసినట్లు ఎన్బీఈ (NBE) ఛైర్మన్ డాక్టర్ అభిజాత్ సేథ్ తెలిపారు. ఎన్‌బీఈ గత ఏడేళ్లుగా నీట్‌-పీజీని నిర్వహిస్తోందని.. బోర్డు కచ్చితమైన ఎస్‌ఓపీ కారణంగా పేపర్ లీక్ అయినట్లు ఎలాంటి నివేదిక రాలేదన్నారు.

READ MORE: Vizag: కిడ్నీ రాకెట్ కేసులో వెలుగులోకి నిజాలు.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు

కాగా.. నీట్ పీజీ పరీక్షల రద్దుపై పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో 10 లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలవడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి. నీట్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవిస్తోన్నాయి. కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.