Site icon NTV Telugu

Narayana Junior College: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం.. విరిగిన విద్యార్థి దవడ ఎముక!

Sam

Sam

నారాయణ జూనియర్ కాలేజీలకులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇంచార్జి దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి దవడ ఎముక విరిగిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ మలక్ పేట పోలీసులకు పిర్యాదు చేశారు. ఫ్లోర్ ఇంచార్జి, నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణ జూనియర్ కాలేజీ గడ్డిఅన్నారం బ్రాంచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: Bathukamma 2025: బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు.. బాట పువ్వులే అమ్మవారు!

ఈ నెల 15 తేదీ మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో నారాయణ జూనియర్ కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏ ఆర్గ్యుమెంట్ విషయంలో ఫ్లోర్ ఇంచార్జి మాలి సతీష్ కలగచేసుకున్నాడు. ఆవేశంలో విద్యార్థులను చితకబాదాడు. దాడిలో విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. విషయం తెలిసిన సాయి పునీత్ కుటుంబ సభ్యులు మలక్ పేట పోలీసులకు పిర్యాదు చేశారు. నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇంచార్జి సతీష్ పై కేసు నమోదు చేశారు. తమ కుమారుడు సాయి పునీత్ దవడ ఎముక విరిగి తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ దాడికి పాల్పడిన ఫ్లోర్ ఇంచార్జి, నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.

Exit mobile version