NTV Telugu Site icon

Nara Lokesh: ఏపీ సౌత్ ఇండియా బీహార్ గా మారుతోంది..

Lokesh

Lokesh

ఏపీ సౌతిండియా బీహార్ గా మారుతోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించాం.. ఆధారాల్లేకుండా రోజుల తరబడి జైళ్లల్లో ఉంచుతున్నారు.. 260 కేసులు సీనియర్ నేతలపై పెట్టారు.. టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై 60 వేల కేసులు పెట్టారు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై ఆధారాల్లేకుండా తప్పుడు కేసులు పెట్టారని గవర్నరుకు వివరించాం.. పవన్ కళ్యాణ్ ను ఏపీలోకి రాకుండా ఎలా అడ్డుకున్నారో గవర్నరుకు వివరించాం.. ప్రతిపక్ష నేతల పైనే కాకుండా వివిధ వర్గాలకు చెందిన వారిని ఎలా వేధిస్తోన్నారో వివరించామని నారా లోకేష్ తెలిపారు.

Read Also: Shakib Al Hasan-Umpires: రెండుసార్లు అంపైర్లు అడిగినా.. బంగ్లా కెప్టెన్ షకిబ్ వెనక్కి తగ్గలేదు!

న్యాయ వ్యవస్థపై వైసీపీ చేసిన దాడులు వివరించామని నారా లోకేష్ పేర్కొన్నారు. 17-ఏ అంశాన్ని పట్టించకోకుండా చంద్రబాబును ఏ విధంగా అరెస్ట్ చేశారోననే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.. భయం మా బయోడేటాలో లేదు.. అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం.. సైకోను ఎదుర్కొవడానికి ఏం ప్రిపరేషన్ ఉంటుంది?.. ప్రజలే యుద్దం చేయడానికి ప్రిపేర్డుగా ఉన్నారు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై క్లారిటీ వచ్చాక.. భవిష్యత్ కార్యాచరణ ఫిక్స్ చేస్తాం.. రేపు అచ్చెన్న నేతృత్వంలో
సీఈఓను కలుస్తామని నారా లోకేష్ అన్నారు.

Read Also: Supreme Court: కమిటీలు వేస్తే కాలుష్యం తగ్గిపోతుందా? విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు..

ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరిస్తామని లోకేస్ అన్నారు. రూ. 150 కోట్లను అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టు వైసీపీ ఖాతాలో ఉంది.. ఆ పార్టీకి ఇంకేం ఖర్చుల్లేవంట.. అడ్వాన్స్ రూపంలో చేసిన చెల్లింపులు ఎక్కడికి వెళ్లాయి.. సీఎం జగన్ దొంగోడు.. దొంగోడు పేరుతో దొంగ ఓట్లు ఎందకుండవ్?.. 35 కేసుల్లో జగన్ నిందితుడు అని ఆయన ఆరోపించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన వ్యక్తి సీఎం జగన్.. జనసేనతో ఇప్పటికే సంప్రదింపులు జరిపాం.. త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తాం.. కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. తాగునీటి సమస్య కూడా ఉంది.. ఈ సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.