Minister Nara Lokesh Attends Fan Wedding: తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించారు మంత్రి లోకేష్ .. గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఆగస్టు 20వ తేదీన యువనేత నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు… విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక పంపించారు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది. బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అకస్మాత్తుగా అభిమాన నేత లోకేష్ తమ ఇంటికి రావడంతో భవ్యతోపాటు ఆమె తల్లిదండ్రులు నాగుమోతు రాజా, లక్ష్మి ఆనందంతో పొంగిపోయారు. యువనేత లోకేష్ ను చూసి వారి ఉద్వేగానికి గురయ్యారు.
READ MORE: Rakshith Atluri: డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు!
