NTV Telugu Site icon

Nara Lokesh: ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్..

Naralokesh

Naralokesh

Nara Lokesh: ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇల్లు పూర్తిగా నీట మునిగాయని, ఆస్తులు ధ్వంసం అయ్యాయని మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన చెప్పుకున్నారు బాధితులు.. నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులు. అలాగే ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన 630 గ్రాములు బంగారాన్ని, మంగళగిరిలో పనిచేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన, గో బెడ్ అనే వ్యక్తి అపహరించాడని.. బంగారంతో సహా పశ్చిమ బెంగాల్ పారిపోయాడని మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసారు బాధితులు. ఆ నిందితుడిని అరెస్టు చేసి తమ బంగారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు బాధితులు..

Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..

పలు అనారోగ్య, ఆర్థిక సమస్యలపై మంత్రి నారా లోకేష్ కు వినతుల సమర్పించారు బాధితులు. వారందరి వినతిపత్రులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ అతి త్వరలో వాటికి పరిష్కారం చూపించే విధంగా పనులు జరుగుతాయని వారికి తెలిపారు.

Balapur Laddu: 1994 నుంచి 2024 వరకు.. బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే..

Show comments