NTV Telugu Site icon

14 Days Girlfriend Intlo: హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ.. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే?

14 Days

14 Days

హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. నాని’స్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని లేడీస్ గ్యాంగ్ లో ఒకరైన శ్రియ కొంతం ఇప్పుడు హీరోయిన్ గా మారింది. అంకిత్ కొయ్య హీరోగా శ్రియ కొంతం హీరోయిన్ గా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమా తెరకెక్కింది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ విడుదలైంది. సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మిస్తున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రాన్ని శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించారు. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డు అందుకున్న పీ.ఏ దీపక్ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రానికి పనిచేయడం విశేషం. మార్చి 7న విడుదల అవుతున్న 14 డేస్ సినిమా ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా, లవ్, కామెడీ సన్నివేశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.

Posani Krishna Murali : పోసాని ఛాతి నొప్పి డ్రామా.. తిరిగి రాజంపేట సబ్ జైలుకు?

గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అమ్మాయి వాల్ల తల్లిదండ్రులకు, తాతాకు ఈ విషయాన్ని తెలియకుండా హీరోయిన్ ఎలాంటి పాట్లు పడింది అనేది చాలా ఆసక్తిగా ఉంది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా చాలా కెమెడీగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక ఫుల్ సినిమాలో ఆయన కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. శ్రియ కొంతం హీరోయిన్ గా నటిస్తున్నారు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ పై చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. అంకిత్ కొయ్య, శ్రియ కొంతంలతో పాటు ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ తదితరులు నటిస్తన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ అసోసియేట్ గా పనిచేసిన శ్రీ హర్ష మన్నె 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రంతో డెబ్యూ గా ఎంట్రీ ఇస్తున్నారు.