Site icon NTV Telugu

Daniel Balaji: నాని సినిమా విలన్ డేనియల్ బాలాజీ కన్నుమూత..

Denial

Denial

ప్రముఖ కొలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు.. గత రాత్రి గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో ఉండగానే మధ్యలోనే ప్రాణాలను విడిచారు..ఈయన మరణం ఇండస్ట్రీకి తీరన లోటు. ఒక పెద్ద విలన్ ను ఇండస్ట్రీ కోల్పోయింది..

ఈయన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా విలన్ గా చేశారు.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు.. మొదట సీరియల్ లో నటించిన ఆయన విలన్ గా మారి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు.. ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు.. తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు.

తెలుగులో ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు.. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ మూవీలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించాడు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో వెంకీ ఘర్షణ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత చివరగా టక్ జగదీష్‌లో మెయిన్ విలన్‌గా డానియల్ బాలాజీ కనిపించాడు. ఫిలిం మేకర్ అవ్వాల్సిన అతను విలన్ గా సెటిల్ అయ్యాడు.. ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగున్నాయని సమాచారం..

Exit mobile version