నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో సెకండ్ ర్యాంక్ హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్, అలాగే సినిమాల నాన్–థియేట్రికల్ మార్కెట్ (OTT + సాటిలైట్) కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉండటంతో, నానితో సినిమా చేయాలనుకునే దర్శకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్–ఎమోషనల్ డ్రామా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మొదటి భాగం విడుదల కానుంది. ఇందులో నాని పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. అయితే తాజాగా నాని తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
Also Read : Border 2 : ‘బోర్డర్ 2’ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్..
ఇప్పటికే ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా చేయడానికి నాని సిద్ధమవుతుండగా.. ఈ ప్రాజెక్ట్‌పై కూడా అభిమానులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇంతలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘96’, ‘మెయ్యళగన్’ వంటి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్, నానితో ఇటీవల ఒక కొత్త కాన్సెప్ట్‌పై మీటింగ్ జరిపారు. ఆ ఐడియా నానికి బాగా నచ్చిందట ఫార్మల్‌గా ఓకే కూడా చెప్పేశాడట. ప్రేమ్ కుమార్ సినిమాలకు నాని ఎప్పటి నుంచో ఫ్యాన్ అని పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. అందుకే ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో మంచి ఆసక్తి ఏర్పడింది. కానీ ఈ సినిమా త్వరగా మొదలయ్యేలా కనిపించడం లేదు.. ఎందుకంటే నాని ముందుగా రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. ప్రేమ్ కుమార్‌కు విక్రమ్‌తో పాటు మరికొన్ని తమిళ సినిమాలు లైన్లో ఉన్నాయి. అందుకే ఈ కాంబినేషన్ అంత త్వరగా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు తక్కువ. అయినా, స్క్రిప్ట్‌పై వర్క్ పూర్తయ్యే సరికి, అన్ని క్లీన్ అయితే, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
